Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొత్త దర్శకుడితో కల్యాణ్ రామ్ 'మిలియనీర్ '

  • వరుస సినిమాలతో కల్యాణ్ రామ్ 
  • కొత్త దర్శకుడితో నెక్స్ట్ మూవీ  
  • త్వరలోనే సెట్స్ పైకి
హీరోగా కల్యాణ్ రామ్ వరుస సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. ఒక వైపున 'ఎమ్మెల్యే' .. మరో వైపున 'నా నువ్వే' సినిమాలను ముగింపు దశకి తీసుకొచ్చిన కల్యాణ్ రామ్, తాజాగా మరో సినిమాను అంగీకరించినట్టు సమాచారం. కొత్త దర్శకుడితో ఆయన ఈ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి 'మిలియనీర్' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారట.

'నిన్నుకోరి' కథతో నాని దగ్గరికి దర్శకుడు శివ నిర్వాణను పంపించి .. ఆ ప్రాజెక్టు ఓకే కావడంలో కోన వెంకట్ ప్రధానమైన పాత్రను పోషించాడు. అలాగే తాజాగా మరో కొత్తదర్శకుడిని కల్యాణ్ రామ్ దగ్గరికి పంపించి ఆ కథకు గ్రీన్ సిగ్నల్ వచ్చేట్టుగా చేశారని అంటున్నారు. విభిన్నమైన కథతో ఈ సినిమా రూపొందనుందని వినికిడి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలను వెల్లడించనున్నారు. ఈ సినిమా తరువాతనే పవన్ సాదినేనితో కలిసి కల్యాణ్ రామ్ సెట్స్ పైకి వెళతాడని చెబుతున్నారు.
kalyan ram
kona venkat

More Telugu News